దూరప్రాంతాల్లో షూటింగ్‌లే కారణం సుహాసిని

Nov 28,2024 19:10 #movie shooting, #movies, #Suhasini

‘ఇతర రంగాల్లో పనిచేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారు. సినిమారంగంలో అలా కాదు. 200 నుంచి 300 మంది షూటింగ్‌ కోసం వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడి విధి విధానాలు సరిగా లేకపోతే కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. 200 మంది వరకూ వారి కుటుంబా లకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సినిమా రంగంలోకి వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాల షూటింగ్‌లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయి. నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సివస్తుంది. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే చిత్ర పరిశ్రమలో జరుగుతోంది’ అని హీరోయిన్‌ సుహాసిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమాల్లో మహిళలకు రక్షణ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో సుహాసిని మాట్లాడారు.

➡️