‘పెళ్లిరోజు’లో జడ్జి పాత్రలో నటిస్తున్నా : సుమన్‌

Jul 10,2024 20:16 #judge role, #suman

‘పెళ్లిరోజు’ సినిమాలో తాను జడ్జి పాత్రలో నటిస్తున్నానని హీరో సుమన్‌ వెల్లడించారు. ఈ సినిమాకు వల్లభనేని సురేష్‌చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏలూరులో ఈ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ ‘పెళ్లి’లో మన దేశ ఆచార వ్యవహారాలకు నిలువుదట్టం…మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే చక్కని రూపమే పెళ్లి. పెళ్లి అయిన కొన్నాళ్లకు జరిగే పరిణామాలతో విడిపోవాలనుకుంటారు. వారి పెళ్లిరోజే తిరిగి విడాకుల నుంచి మళ్లీ కలిసిపోయేలా చేయటమే ఇతివృత్తింగా ఈ సినిమా సాగుతుంది’ అని వివరించారు. లాయర్‌గా వీరంకి వెంకట నరసింహారావు నటించారు. మిగతావారంతా స్థానిక కళాకారులే నటులుగా ఉన్నారు.

➡️