సూర్య ‘రెట్రో’ తెలుగు టీజర్‌ విడుదల

తమిళ కథా నాయకుడు సూర్య నటిస్తున్న కొత్త సినిమా ‘రెట్రో’. ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. గతేడాది ‘కంగువ’ సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం నిరాశపర్చింది. కొత్త కథతో ప్రేమ, యాక్షన్‌ అంశాలను మేళవించి కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

➡️