సుశాంత్‌ కొత్త సినిమా

Mar 18,2025 20:55 #movies, #sushanth

అక్కినేని సుశాంత్‌ ఓ కొత్త సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. మంగళవారం సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ విడుదలైంది. వరుణ్‌ కుమార్‌, రాజ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి పృథ్వీరాజ్‌ చిట్టేటి రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్‌ ఇందులో రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నారు. సుశాంత్‌ ఇందులో ఎక్సర్సిస్ట్‌ పాత్రను పోషిస్తున్నారని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు, దర్శకుడు పృథ్వీరాజ్‌ చిట్టేటితో కలిసి డైలాగ్స్‌ అందించారు. వైవిబి శివ సాగర్‌ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆశిష్‌ తేజ పులాల ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

➡️