శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘స్వాగ్’. ఈ సినిమాలో ఆయన నాలుగు పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల నాలుగో తేదీన విడుదల కానుంది. అతిథి పాత్రలతో కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశారు. తాను ఆంధ్రా జట్టు జరపున అండర్-19 క్రికెట్ ఆడాననీ, అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్ తరపున ఆడేవాడరని గుర్తుచేశారు. అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారన్నారు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్‌గా నటించారు.