Taapsee Pannu’s wedding video : తాప్సీ పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Apr 4,2024 12:44 #Taapsee Pannu's, #wedding video

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి తాప్సీ.. తాను ప్రేమించిన మథియాస్‌ బోని గత నెల (మార్చి 23)లో ఉదరుపూర్‌లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయలేదు. వీరి పెళ్లికి వెళ్లిన బాలీవుడ్‌ నటుడు పావెల్‌ గులాటి ఫొటోలను షేర్‌ చేస్తేనే తాప్సీ మ్యారేజ్‌ విషయం బయటికొచ్చింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో తాప్సీ ఎరుపు రంగు దుస్తుల్లో.. కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకుని, డ్యాన్స్‌ చేస్తూ వేదికపైకి వచ్చారు. మథియాస్‌ సింపుల్‌ డ్రెస్‌ వేసుకున్నారు. వీరిద్దరూ వేదికపై దండలు మార్చుకుని ఒక్కటవ్వగానే వారిపై పూల వర్షం కురుస్తుంది.

➡️