ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అద్భుతంగా పాట పాడిన అంధ గాయకుడు రాజుకు సినీ సంగీత దర్శకుడు తమన్ మంచి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు ఇండియన్ ఐడిల్ సీజన్ 4లో స్టేజ్‌పై పాట పాడించే అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాజుతో కలిసి తాను కూడా అదే స్టేజ్‌పై పాడతానని ప్రకటించారు. రాజుకు అవకాశం ఇవ్వడంపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజు పాటను ఆయన కూడా అభినందించారు. పాట పాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్‌చేశారు.