10 రోజులు కష్టపడ్డా..: తమన్‌

‘పుష్ప 2′ కోసం నేను 10 రోజులపాటు కష్టపడ్డా. మూడు వెర్షన్లలో గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చా. టీమ్‌కి అది నచ్చింది కూడా. కాకపోతే ఫైనల్‌గా డిఎస్పీ, సామ్‌ సీఎస్‌ ఇచ్చిన మ్యూజిక్‌ను ఓకే చేశారు. అయినా సరే నాకేం బాధ లేదు. అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసు కున్నారు’ అని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆదరణకు నోచుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు తాను కూడా మ్యూజిక్‌ ఇచ్చానని తమన్‌ చెప్పారు. తమన్‌ పేరు ఎక్కడా లేదు. అసలేమి జరిగిందనేది ఓ ఇంటర్వ్యూలో పై విధంగా తమన్‌ స్పందించారు.

➡️