వాళ్లను రానీయకండి..

యూట్యూబ్‌ ఛానల్స్‌, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ్‌ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎక్స్‌ వేదికగా బుధవారం పోస్ట్‌ పెట్టింది. ‘ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ‘ఇండియన్‌ 2’, ‘వేట్టయన్‌’, ‘కంగువా’ ఫలితాలపై పబ్లిక్‌ టాక్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇచ్చే విశ్లేషణలు ఎంతో ఎఫెక్ట్‌ చూపింది. రానురాను చిత్ర పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతోంది. దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలూ ఏకం కావాలి. పరిశ్రమ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో సమయంలో థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటివాటికి పాల్పడితే అంగీకరించేది లేదు’ అని పేర్కొంది.

వారి విశ్లేషణలు సమస్యగా మారాయి : తమిళ్‌ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌
”ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ‘ఇండియన్‌ 2’, ‘వేట్టయన్‌’, ‘కంగువా’ ఫలితాలపై పబ్లిక్‌ టాక్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇచ్చే విశ్లేషణలు ఎంతో ఎఫెక్ట్‌ చూపింది. రానురాను చిత్ర పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతోంది. దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి. పరిశ్రమ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో సమయంలో థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటివాటికి పాల్పడితే అంగీకరించేది లేదు” అని తమిళ్‌ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

ఇండియన్‌ 2, కంగువాలకు ఇదే పరిస్థితి…!
కమల్‌హాసన్‌ నటించిన ‘ఇండియన్‌ 2’ విడుదలైన నాటినుంచే నెగిటివ్‌ రివ్యూలు వచ్చిన సంగతి విదితమే. సినిమాలోని నటీనటులు, దర్శకుడిని విమర్శలు చేశారు. మరోవైపు, ఇటీవల విడుదలైన ‘కంగువా’కూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సూర్య యాక్టింగ్‌ బాగుందని మెచ్చుకున్నప్పటికీ.. సినిమాని మాత్రం తీవ్రంగా విమర్శించారు. కథ బాలేదని ఆరోపించారు. సౌండ్‌ విషయంలోనూ కామెంట్స్‌ వచ్చాయి. వీటిపై నటి జ్యోతిక స్పందించారు. ”కంగువా చిత్రానికి వస్తోన్న నెగిటివ్‌ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా. గతంలో విడుదలైన భారీ బడ్జెట్‌ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్‌ ఉన్నా, సన్నివేశాలు బాగోలేకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. ఇందులో ఎన్నో పాజిటివ్స్‌ ఉన్నప్పటికీ దానిని ఎవరూ గుర్తించలేదు. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్‌ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలిరోజు నుంచే ఇంత నెగిటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన దఅశ్యాన్ని రూపొందించడానికి బృందం ఎంచుకున్న కాన్సెప్ట్‌, ప్రయత్నానికి తప్పకుండా ప్రశంసలు దక్కాలి” అని ఆమె అన్నారు. ఆమె పోస్ట్‌కు పలువురు నటీనటుల నుంచి మద్దతు లభించింది. రివ్యూల కారణంగా సినిమా ఫలితం కొన్నిసార్లు దెబ్బతింటున్నమాట వాస్తవమేనని చాలామంది స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

➡️