తమిళనాడు : పంచామృతం పై తమిళ చిత్ర దర్శకుడు జి.మోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. తమిళ చిత్ర దర్శకుడు జి.మోహన్ ఇటీవల ఓ వీడియోలో పంచామృతంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వీడియోలో ఆయన ‘పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదవడంతో మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను తిరుచ్చికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
