తండేల్ టికెట్ రేట్లకు పెంపుకు అనుమతి

Feb 5,2025 08:20 #telugu movies

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో ఒక్కొక్క టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో ఒక్కొక్క టికెట్ పైన 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. అదే ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే యువకుడు వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

➡️