అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల ఏడోతేదీన విడుదల కానుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్‌ను పిలిచారు. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అనివార్యకారణాలతో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేశామనీ, ‘ది ఐకానిక్ తండేల్ జాతర’ను ఆదివారం ఘనంగా జరుపుతామని ప్రకటించారు. ఈ పాలి యాట గురితప్పేదే లేదంటూ సినిమా డైలాగ్‌ను కూడా అందులో చేర్చారు.
