‘తండేల్‌’- 1000 మంది ఆర్టిస్టులతో శివరాత్రి సాంగ్‌ షూట్‌

యువ సామ్రాట్‌ నాగ చైతన్య మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ తండేల్‌. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్య లేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని స్ఫూర్తితో, టీమ్‌ సినిమా కోసం అద్భుతమైన, మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను చిత్రీకరీంచింది. మ్యాసీవ్‌ సెట్స్‌, హై ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో అద్భుతమైన శివరాత్రి సాంగ్‌ని గ్రాండ్‌గా స్కేల్‌లో షూట్‌ చేశారు. దేవి శ్రీ ప్రసాద్‌ ఒక టైమ్‌లెస్‌ క్లాసిక్‌ సాంగ్‌ ని కంపోజ్‌ చేసారు, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌ లో నాగ చైతన్య, సాయి పల్లవి, వేలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి అద్భుతంగా అలరించారు. తండేల్‌ మూవీ పాన్‌ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

➡️