తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి లో వచ్చేవారం ప్రారంభం కానుంది.
