తెలంగాణ : ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. విడుదల కానున్న దేవర మూవీ స్పెషల్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చింది. అలాగే తెలంగాణాలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న రాత్రి ఒంటి గంటలకు 29 థియేటర్లలో అదనపు ప్రదర్శన, టికెట్ రేట్లను రూ.100 పెంపు కు అనుమతి ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 4 గంటల నుండి తెలంగాణాలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను రూ.100 పెంచుతూ 6 ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. 28వ తేదీ నుండి 06-10-2024 వరకు (9 రోజులు), 5 ప్రదర్శనలకు రూ.25 పెంపు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలాగే మల్టీప్లెక్స్‌ల కోసం రూ.50 పెంపుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతినిచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవర లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. దేవర లో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అలాగే హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు. దేవర లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించి అభిమానులను అలరించనున్నారు.
