విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ (53) మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పాటల రచయితగా ఆయన టాలీవుడ్‌లో మంచి గుర్తింపును పొందారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవటం, అనంతరం అనారోగ్య కారణాలతో మానసికంగా కృంగిపోయారు. హైదరాబాద్‌లో తొలుత జర్నలిస్టుగా చేరారు. ఆ తర్వాత సినీ గీత రచయితగా పనిచేశారు. చిత్రం, ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం,జయం, సైనికుడు లాంటి మంచి సినిమాలకు పాటలు రాశారు. కులశేఖర్ మృతికి పలువురు టాలీవుడ్ ప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు.