అడవిలో ‘థామా’ షూటింగ్‌

ఆయుష్మాన్‌ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. గత నెలరోజులుగా ఈ సినిమా ఊటీతోపాటుగా సమీపంలోని అడవిలో షూటింగ్‌ జరుగుతోంది. ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వంలో దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్నారు. హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీలపై క్లైమాక్స్‌ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ టాకీ పార్ట్‌ దాదాపుగా పూర్తయ్యింది. పాటలు మాత్రమే మిగిలివున్నాయి. మడాక్‌ ఫిల్మ్స్‌ (నిర్మాత దినేష్‌ విజన్‌) హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

➡️