నటుడు నవీన్‌పోలిశెట్టి, నటి మీనాక్షిచౌదరి కలిసి నటిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు కావటంతో టీజర్‌ను మేకర్లు గురువారం విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్ పోలిశెట్టి…ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేష్ అంబానీ ఫోన్ చేశాడు. ముకేష్ మామయ్య…నీకు వంద రీచార్జులు..ఇప్పుడే మన అనంత్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా..అంటూ సంభాషణ మొదలు పెడతాడు. జస్టిస్ బీబర్, కిమ్ కర్దాషియన్, జాన్ సేన..అందరితో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తానని చెబుతుంటాడు. చివర్లో పెళ్లి కూతురు మీనాక్షి చౌదరితో ఫొటోషూట్ కూడా చేయించారు. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
