శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శిశిరం’. ఆదివారం నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని రత్నాకర్ తెలిపారు. ఆటోనగర్‌లోని సూర్యశిల్పశాల, బుర్రిపాలెంరోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్, జాగర్లమూడి, శేకూరు, కొలకలూరులో మూడు రోజులపాటు షూటింగ్ కొనసాగుతుందన్నారు. లిటిల్‌స్టార్ భాను ప్రకాష్, మాస్టర్ పుష్కర్, బేబి అమృత, ప్రిహాన్స్ సిస్టర్స్‌తోపాటుగా బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, సోమేష్, కోటేశ్వరరావు, గోము, వసంత యామిని, తులసి, ప్రియాంక, డాక్టర్ జీవనలత, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, రచయిత అయనాల మల్లేశ్వర రావు నటిస్తున్నారు.
