చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూదాన్ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజరుకుమార్ దర్శకత్వం వహించారు. మెగా మేజ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ సి.సమర్పణలో చిందాసు ధనుంజరు నిర్మించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు ట్రైలర్‌ను విడుదల చేశారు. వీక్షించిన సురేష్‌బాబు అనంతరం దర్శక,నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. ఈ చిత్రంలో శివరామ్‌రెడ్డి, సాయిచందన జంటగా నటించారు. బన్నీ అభిరన్ కీలకపాత్ర పోషించారు. సంగీతం ప్రశాంత్‌మార్క్, సినిమాటోగ్రాఫర్ లింగా గౌడ్, ఎడిటింగ్ రాజ్‌చెన్నూరి, పవన్ అందించారు.
