తెలంగాణ : మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో .. విదేశాల నుంచి విష్ణు హైదరాబాద్‌కు మంగళవారం వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మరోసారి చర్చలు జరుగుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న కూడా పెద్ద మనుషుల సమక్షంలో మోహన్‌బాబు, మనోజ్‌ల మధ్య చర్చలు జరిగాయి.
