అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ ది రూల్ సినిమా చివరి షెడ్యూల్ ముగించుకుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చివరి షెడ్యూల్ వార్తను చిత్రబృందం షేర్‌చేసింది. ‘పుష్ప షూటింగ్ చివరి రోజు.. చివరి షాట్. పుష్ప ఐదేళ్ల ప్రయాణం పూర్తయింది. వాట్ ఏ జర్నీ.. అంటూ అల్లు అర్జున్ షూట్ లొకేషన్ స్టిల్ షేర్ చేశారు.