ఓటేసిన మాజీ ఉపరాష్ట్రపతి – తెలుగు హీరోలు జూ.ఎన్‌టిఆర్‌-అల్లు అర్జున్‌

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఈ ఓటింగ్‌ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి ఫిలింనగర్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ మాదాపూర్‌లో ఓటేవేశారు. తెలుగు చిత్రసీమ హీరోలు జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌.. అందరితో కలిసి క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. ఉదయాన్నే ఫిలింనగర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్‌.. క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ … ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, సన్నిహితులైనవారికి మద్దతునిస్తానని చెప్పారు.

➡️