దీక్షిత్‌శెట్టి, రష్మిక మందన్నా జోడీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ. టీజర్‌ను విజరు దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్‌లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వేచి చూస్తున్నా. ఎనిమిదేళ్లక్రితం రశ్మికను సెట్‌లో కలిశా. నేడు ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా ఆమె వ్యక్తిగతంగా ఇప్పటికే అంతే హుందాగా పనిచేస్తున్నారు. నటిగా ఆమెకు ‘ది గర్ల్ ఫ్రెండ్’ మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడిని కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా’ అన్నారు. విజరుదేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ కొనసాగింది. ‘నీకని మనసుని రాసిచ్చేసా…పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజరు దేవరకొండ చెబుతుండగా..స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.