‘ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. విశాలమైన సముద్ర తీరం, కనువిందు చేసే నదీ ప్రవాహాలు, విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అరకు, విశాఖపట్టణం, విజయవాడతోపాటుగా హోప్‌ఐలాండ్, భవానీఐలాండ్, హార్సిలీహిల్స్, భవానీద్వీపం, తలకోన, భైరవ కోన వంటి ప్రాంతాలు షూటింగ్‌లకు మంచి అనుకూలమైన ప్రదేశాలు. కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర్ర ప్రభుత్వాలే సినిమాల నిర్మాణాలకు అవసరమైన మౌళిక సదుపాయాలు, స్టూడియోలు వంటివి ఏర్పాటుచేస్తున్నాయి. ఆంధ్రాలో కూడా కొత్తగా స్టూడియోల నిర్మాణం జరగాల్సివుంది. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. త్వరలోనే ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కళ్యాణ్, హిందూపురం శాసనభ్యులు, సినీటులు నందమూరి బాలకృష్ణను కలిసి ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలు గురించి తెలియజేస్తాం. రాష్ట్రప్రభుత్వం ద్వారా ప్రోత్సాహకాలు, రాయితీలు, వసతులు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తాం’ అని సినీ నిర్మాత మహేశ్వర కె.అన్నారు.
