రాజు చాలా ధైర్యవంతుడు

May 21,2024 19:15 #movie, #naaga chaithanya

నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్లో వస్తున్న తండేల్‌ చిత్ర విశేషాలను తాజాగా నాగచైతన్య ఓ సమావేశంలో ముచ్చటించారు. పాకిస్థాన్‌ ప్రాదేశిక జలాల వెంబడి పట్టుబడి రెండేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి భారత్‌కు తిరిగొచ్చిన రాజు అనే వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఈ పాత్ర కోసం నేను తొమ్మిది నెలలు ప్రిపేర్‌ అయ్యా. రాజు ఇంటికెళ్లా.. అతడి ధైర్యసాహసాలు, సంకల్పం గురించి తెలుసుకొని ఆశ్యర్యపోయా. మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారితో కొంత సమయం గడిపాను. తండేల్‌ నా కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా.. ఆ పాత్ర నాకు కావాలి.. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. నేను శ్రీకాకుళం యాసతోపాటు ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా’ అని నాగ చైతన్య చిత్ర విశేషాలు చెప్పారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌. తండేల్‌ 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

➡️