రవితేజ-శ్రీలీల జోడీగా సినిమా ప్రారంభం

Jun 11,2024 19:20 #movie, #raviteja

‘ధమాకా’ సినిమాలో తొలిసారి జంటగా నటించిన రవితేజ, శ్రీలీల జోడి మళ్లీ రిపీట్‌ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి రవితేజ 75వ చిత్రాన్ని ప్రొడక్షన్‌ నం.28గా నిర్మిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ హాస్యంతో కూడిన మాస్‌ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. భీమ్స్‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మంగళవారంనాడు ఉదయం 7:29 గంటలకు పూజా కార్యక్రమంతో మేకర్స్‌ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌ కి శ్రీలీల క్లాప్‌ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ కొనసాగుతుందని నిర్మాతలు వెల్లడించారు.

➡️