14 నుంచి అఖిల్‌ సినిమా ప్రారంభం

Mar 11,2025 20:24 #movies

‘ఏజెంట్‌’ సినిమా తర్వాత కథానాయకుడు అఖిల్‌ అక్కినేని నటించనున్న కొత్త సినిమా షూటింగ్‌ ఈనెల 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు నందు దర్శకుడు. ఎక్కువ భాగం షూటింగ్‌ చిత్తూరు జిల్లాలో జరగనుంది. భారతం మెట్ట అనే కొండ ప్రాంతంలో ఎక్కువ భాగం షూటింగ్‌ జరగనుంది. నాగార్జున నిర్మాతగా అఖిల్‌ కోసం చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. అఖిల్‌ కథానాయకుడిగా ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశారు. యువి సంస్థ మరో ప్రాజెక్టును అఖిల్‌కోసం సిద్ధం చేసివుంది.

➡️