నటుడు నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారుచేసింది. బుధవారంనాడు ఆయన పుట్టినరోజు కావటంతో ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్ దేసిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యూత్‌ఫుల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విభిన్నమైన కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. శౌర్య యాంగ్రీ లుగ్‌లో కనిపించారు. వైష్ణవి ఫిల్మ్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. హరీష్ జయరాజ్ సంగీతం. ‘పోలీసు వారి హెచ్చరిక’, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు.
