మహేష్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’ భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. షూటింగ్ పనులకు కాస్త గ్యాప్ రావటంతో ఎప్పటి మాదిరిగానే తన ఫ్యామిలీతో ఇటలీ టూర్‌కు మహేష్ వెళ్లారు. పూర్తికాగానే ఇండియాకు తిరిగి వచ్చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్‌బాబు దిగగానే ఫ్యాన్స్ ఫొటోల కోసం ఎగబడ్డారు. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని హిస్టారికల్ ప్రదేశాలను మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రత, కుమార్తె సితారతో ఉన్న ఫొటోలను ఆయన ఇన్‌స్ట్రాలో పంచుకున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా కొద్దిరోజుల క్రితమే జపాన్ వెళ్లారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ : బి హైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రచారం కోసం తన కుటుంబంతోపాటు వెళ్లారు. మరో రెండురోజుల్లో తిరిగి రాబోతున్నారు. తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
