‘పుష్ప-2’ ది రూల్‌ నుంచి రేపు వీడియో సాంగ్‌  విడుదల 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ  భాషల్లో పుష్ప….. పుష్ప… పుష్ప… పుష్పరాజ్‌ అనే తొలి లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ఈ అప్‌డేట్‌తో ఐకాన్‌స్టార్‌ అభిమానులు సంబరాల్లో వున్నారు. ఇందుక సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఐకాన్‌స్టార్‌  పూర్తి మాస్‌గెటప్‌లో నడుస్తూ కనిపిస్తున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.  2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

➡️