ప్రేక్షకులు రాక తెలంగాణాలో థియేటర్లు మూత

May 15,2024 19:02 #closed, #New Movies Updates, #Theaters

తెలంగాణా రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలను నిలిపేస్తున్నామని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపేస్తామని ప్రకటించాయి. ఆక్సుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం వస్తోందని, అందుకే ప్రదర్శనలు నిలిపేయాలని నిర్ణయించామని వివరించాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపేస్తన్నామనీ, నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్‌ అద్దెలు పెంచాలని డిమాండ్‌చేశాయి. పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టంచేశాయి.

➡️