అప్పుడు నా గుండె పగిలింది : విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘మెరీ క్రిస్మస్‌’ ఈనెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆస్కార్‌ నామినేషన్ల గురించి స్పందించారు. ‘ఆస్కార్‌ నామినేషన్లకు ఎంపికైన చిత్రాల లిస్ట్‌లో ‘సూపర్‌డీలక్స్‌’ లేనందుకు నాతోపాటు చిత్రబృందమంతా బాధపడింది. ఆ క్షణం నా గుండె పగిలినంత పనైంది. నేను ఆ సినిమాలో ఉండడం వల్ల అది ఆస్కార్‌కు వెళ్లాలని కాదు.. నేను అందులో నటించకపోయినా నామినేట్‌ అవ్వాలని కోరుకునే వాడిని. మంచి చిత్రానికి ఆదరణ లభించాలనేది నా ఉద్దేశం. మధ్యలో ఏం జరిగిందనే దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని చెప్పారు. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించారు. ఇక తాజా చిత్రం ‘మెరీ క్రిస్మస్‌’, ఒక రాత్రి జరిగిన సంఘటన ఇద్దరి వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించారు. కత్రినా కైఫ్‌ కథానాయిక. ప్రీతమ్‌ స్వరాలు అందించారు.

➡️