ఒకప్పటి నటి సౌందర్య, మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ ఇటీవల ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగాడు. ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లోనిసౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. మంచు ఫ్యామిలీతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబును నేను గౌరవిస్తాను. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి’ అని ఒక లేఖలో పేర్కొన్నారు.
