OTT : ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Apr 1,2024 14:13 #movie, #OTT

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో వినోదాన్ని పంచడానికి పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్‌ మొదటివారంలో ఏ సినిమాలు థియేటర్‌, ఓటీటీలో విడుదల కానున్నాయో తెలుసుకుందామా..!

ది ఫ్యామిలీ స్టార్‌
ప్రముఖ నటుడు విజరు దేవరకొండ, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్‌’. ఈ సినిమా ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్‌ తెరకెక్కించారు. గతంలో విజరుదేవరకొండ, పరుశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ కొట్టింది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్‌.’ ఈ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.

 

భరతనాట్యం
సూర్యతేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరత నాట్యం’. ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి కథానాయిక. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. పాయల్‌ సరాఫ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజరుఘోష్‌, సలీం ఫేకు వంటి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

బహుముఖం
హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. స్వర్ణిమా సింగ్‌, మార్టినోవా కథానాయికలు. ఇదొక వినూత్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని చిత్ర బృందం చెబుతోంది. ఏప్రిల్‌ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంజుమ్మల్‌ బార్సు
మాలయాళ సినిమా ‘మంజుమ్మల్‌ బార్సు’ భారీ హిట్‌ కొట్టింది. ఈ హిట్‌ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏప్రిల్‌ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాయి.

ప్రాజెక్ట్‌ జెడ్‌
ప్రముఖ నటుడు సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘మాయావన్‌’. సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో దర్శకుడు సీవీ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడేళ్ల క్రితం తమిళంలో విడుదలైంది. తాజాగా ‘ప్రాజెక్ట్‌ – పేరుతో ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని కరీమున్నీసా నిర్మించారు.

➡️