కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) అద్భుతమైన పనితీరును తాను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నట్లు సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. డబ్లూసీసీ వల్లే హేమ కమిటీ నివేదిక ఇవ్వగలిగిందని, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చాయన్నారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని సమంత అభిప్రాయపడ్డారు. వీటికోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అయిననప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని, కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్ల్యూసీసీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు.
