అమరావతి : ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై బాలకృష్ణ, పవన్ కల్యాణ్ దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ కోరారు. శుక్రవారం జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ …. ఎవరూ ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించడం ప్రజలకు ఆంధ్రాలో అభివృద్ధి పట్ల కూటమిపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని, చంద్రబాబు నాయకత్వములో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమా ఇండిస్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆంధ్రాలో సినీ పరిశ్రమ సమస్యలపై, అభివృద్ధిపై దృష్టి సారించాలని, వారిపై ఆ నమ్మకం తమకుందన్నారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాని మోడికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని, నారా లోకేష్ , బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కు కూడా ఆంధ్రా ప్రభుత్వంలో మంచి పదవులు వస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.
ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై వారు దృష్టి పెట్టాలి : ఎపి ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్
