రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తోన్న ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి తాజాగా ‘నానా.. హైరానా..’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటని న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేశారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సరిగమ ద్వారా ఈ చిత్ర ఆడియో రిలీజ్ అవుతోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది.