ఈ వారంలో చిన్న సినిమాల సందడి

Oct 2,2024 19:45 #buzz, #short movies, #This week

ఈ వారంలో కొన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. గతవారంలో విడుదలైన ‘దేవర’, ‘సత్యం సుందరం’ వంటి భారీ చిత్రాల హడావుడి తగ్గటంతో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదల కానున్నాయి. వీటిలో తెలుగులోనే ఎనిమిది సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒక్క డబ్బింగ్‌ సినిమా కూడా లేదు. నేరుగా థియేటర్లలో విడుదలయ్యే సినిమాలే కావటం విశేషం. తెలుగులో శ్రీ విష్ణు నటించిన ‘స్వాగ్‌’, పరుచూరి బ్రదర్స్‌ మనువడు సుదర్శన్‌ నటించిన ‘మిస్టర్‌ సెలబ్రిటీ’, ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో సాయి ధన్సిక మెయిన్‌ లీడ్‌గా రూపొందిన ‘దక్షిణ’, సింగర్‌ నోయల్‌ నటించిన ‘బహిర్భూమి’, ఈటీవీ ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌ హీరోగా నటించిన ‘రామ్‌నగర్‌ బన్నీ’, ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య నటించిన ‘కలి’ చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితోపాటుగా హాలీవుడ్‌ నుంచి ‘జోకర్‌’, ‘వైట్‌బర్డ్‌’ సినిమాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు హిందీ, మూడు కన్నడ, నాలుగు తమిళ, ఐదు మలయాళ సినిమాలు ఆయా రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానునఆనయి. వచ్చేవారం రజనీకాంత్‌ నటించిన ‘వేట్టైయాన్‌’, గోపీచంద్‌ ‘విశ్వం’, సుహాస్‌ ‘జనక అయితే గనక’, కన్నడ నుంచి ‘మార్టిన్‌’ లాంటి భారీ చిత్రాలు దసరా సందర్భంగా థియేటర్లలోకి రానున్నాయి.

➡️