14న టైటిల్‌ ప్రకటన

శర్వానంద్‌ ప్రస్తుతం ‘సామజవరగమన’ ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శర్వా 37’ వర్కింగ్‌ టైటిల్‌తో తయారవుతున్న ఈ చిత్ర షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ సుంకర నిర్మాత. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను జనవరి 14న రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

➡️