నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఆమె కొడుకు పాత్రలో కనిపించ నున్నారు. ఈ రోజు ఈ చిత్రం ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ జరగనుంది. సాయంత్రం 7:59 గంటలకు ట్రైలర్ రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తెలుపుతూ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫైర్‌తో ఒక భారీ సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాం.. ఏప్రిల్ 12న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కలుద్దాం’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్‌టిఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని పోస్టర్ ద్వారా తెలిపారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించ బోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది.
