Arrest – డ్రగ్‌ కేసులో టాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ అరెస్టు

Sep 27,2024 08:31 #arrested, #Drug case, #Tollywood actors

బెంగళూరు : డ్రగ్‌ కేసులో కోర్టుకు హాజరుకానందుకు టాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ను హైదరాబాద్‌ సిసిఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్‌ డ్రగ్స్‌ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో ఎస్‌ఆర్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలో గతంలో కేసులు నమోదు చేశారు. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న అభిషేక్‌ కోసం హైదరాబాద్‌ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు గతకొంత కాలం నుంచి వెతుకుతున్నారు. కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలోనే అభిషేక్‌ గోవాలో ఉన్నట్లు పోలీసులకు సమచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న అభిషేక్‌ను అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకుని వచ్చారు. అభిషేక్‌ను హైదరాబాద్‌ లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌-లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అభిషేక్‌ టాలీవుడ్‌లో డేంజర్‌,ఐతే , నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నేను , కాళిదాస్‌ వంటి సినిమాల్లో సాహయ నటుడిగా నటించాడు.

➡️