విశాఖలో సందడి చేసిన ‘ఊరు పేరు భైరవకోన‘ చిత్ర బృందం

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఏకే ఎంటర్టైన్మెంట్‌ , హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేష్‌ దండా నిర్మించిన మ్యాజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన మ్యాజికల్‌ టూర్‌ లో భాగంగా చిత్ర యూనిట్‌ శనివారం విశాఖలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంవిపి కాలనీ లోని గాది రాజు పాలెస్‌ లో నిర్వహించిన మీడియా సమావేశం చిత్ర కధానాయకుడు సందీప్‌ కిషన్‌, కధానాయకి వర్ష, పాల్గొని మీడియాతో మాట్లాడారు. నగరంలో నీ ఒక హౌటల్‌ లో ఈ నెల 16 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని , అదేవిధంగా ఈ నెల 14 న వంద స్క్రీన్స్‌ లో ప్రీమియర్‌ షో లు ప్రదర్శిస్తారు అన్నారు. దర్శకుడు ఆనంద్‌ గతంలో టైగర్‌, ఎక్కడికి పోతావు చిన్న వాడా వంటి సినిమాలు తీశారు అని తెలిపారు. ఈ చిత్రం లో బ్రహ్మాజీ, వైవా హర్ష, రవి శంకర్‌ ముఖ్య పాత్రలు పోషించారని అని తెలిపారు . ఈ సినిమా చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఈ ఏడాది తాను నటించిన మూడు చిత్రాలు విడుదల కానున్నాయని అన్నరు. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర 4 చక్కటి గీతాల తో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా అందించారని అన్నరు. ఇది పక్కా తెలుగు కమర్షియల్‌ సినిమా అని పాడేరు, అదిలాబాద్‌ జిల్లా లో షఉటింగ్‌ చేశాము అని తెలిపారు. ఈ సినిమా హారర్‌, థ్రిల్లర్‌ జోనర్‌ లో వుంటుందని అన్నరు హీరోయిన్‌ వర్ష మాట్లాడుతూ, ఇందులో తాను భూమి అనే మంచి పాత్ర చేశాను. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాలు బాగా ఆదరిస్తారు అన్నారు. ఇది విరూపాక్ష మాదిరిగా ఎంటర్టైనర్‌ మూవీ అన్నారు. తాను నటించిన స్వాతి ముత్యం కి పూర్తి విభిన్న మైన పాత్ర చేశాను. డబ్బింగ్‌ తానే చెప్పాను అన్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ గా కావ్య థాపర్‌ నటించారు అని తెలిపారు.

➡️