సీనియర్ నటి త్రిష తమిళం, తెలుగు, మలయాళం, కన్నడంలో ఏక కాలంలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరోసారి బాలీవుడ్‌లోకి ఆమె రీ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా సమాచారం. 2010లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘కట్టా మీఠా’ చిత్రంలో అక్షరుకుమార్‌కు జంటగా త్రిష నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవటంతో ఆమె ఇక అటు వైపు దృష్టి సారించలేదు. సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి నటుడు సల్మాన్‌ఖాన్ సరసన నటించడానికి అవకాశం వచ్చినట్లుగా సమాచారం.
