“టుక్ టుక్” టైటిల్ పోస్టర్ విడుదల

చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ “టుక్ టుక్” టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.
చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.  రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన “టుక్ టుక్” క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

➡️