కొత్త ప్రాజెక్టులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Jan 29,2025 20:00 #telugu movies

తమిళ కథానాయిక వరలక్ష్మీశరత్‌కుమార్‌ మరో కొత్త ప్రాజెక్టులో నటించబోతున్నారు. ఆమె తండ్రి శరత్‌కుమార్‌ తమిళ ఇండిస్టీలో కథానాయకుడు. తండ్రి వారసత్వాన్ని అందుకున్న ఆమె తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పలు సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కెరీర్‌ ప్రారంభంలో కథానాయిక పాత్రలు పోషించారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసుగా ఆమె అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా ఆదిపర్వం మూవీ డైరెక్టర్‌ సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో మరో ప్రాజెక్టులో ఆమె నటించనున్నారు. సైకాలజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

➡️