‘నింద’తో వరుణ్‌ సందేశ్‌

May 16,2024 20:05 #New Movies Updates

ది ఫెర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వరుణ్‌ సందేశ్‌ ‘నింద’ అనే చిత్రం చేస్తున్నారు. రాజేష్‌ జగన్నాధం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్‌ విడుదలైంది. నవీన్‌ చంద్ర ఈ టీజర్‌ విడుదల చేశారు. తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ మొదలైంది. తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, చత్రపతి శేఖర్‌, మైమ్‌ మధు, సిద్ధార్థ్‌ గొల్లపూడి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

➡️