‘చాలా సంతోషంగా ఉంది’

యుకె పార్లమెంట్‌లో తనకు జరిగిన సన్మానంపై చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయింద’ని పోస్ట్‌ చేశారు. ‘నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరి మణులకు, నా కుటుంబం, శ్రేయోభి లాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది’ అంటూ చిరంజీవి పోస్ట్‌ చేశారు.

➡️