వేట్టైయాన్‌ సెన్సార్‌ పూర్తి

తమిళ హీరో రజనీకాంత్‌ నటించి కొత్త చిత్రం ‘వేట్టైయాన్‌’. ఈ సినిమా సెన్సార్‌ పక్రియను పూర్తి చేసుకుంది. అమితాబ్‌బచ్చన్‌, ఫాహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియన్‌, రిత్విక సింగ్‌, దుషారా విజయన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. టీజే జ్ఞానవేల్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంగీతం అనిరుధ్‌. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 10న ఈ సినిమా విడుదల కానుంది. రజనీకాంత్‌ ఈ సినిమాలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటించారు. సెన్సార్‌బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చినట్లుగా మేకర్లు తెలిపారు. సినిమా రన్‌టైమ్‌ 2.47 గంటలు. ఓవర్సీస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

➡️