టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’.. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ద హంటర్‌ని రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ పోలీసు పాత్రలో నటించిన ఈ సినిమాలో, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది.